ద్వారకా - FAQs

Other languages: English

ద్వారకా ఎక్కడ ఉంది?
ద్వారకా గుజరాత్ లోని దేవభూమి ద్వారకా జిల్లాలో ఉంది.

ద్వారకా ఒకటి అయిన చార్ ధామ్‌లు ఏవి?
బద్రినాథ్, పూరీ, రామేశ్వరం, ద్వారకా.

సప్త పూరీలు ఏవి?
అయోధ్య, మథుర, హరిద్వార్, కాశీ, కాంచీపూరం, ఉజ్జయిని మరియు ద్వారకా. ఈ పవిత్ర స్థలాలకు తీర్థయాత్ర మోక్షాన్ని అందిస్తుంది.

ద్వారకా యొక్క పురాతన పేరు ఏమిటి?
కుశస్థలీ.

ద్వారకా అంటే ఏమిటి?
ద్వారకా అంటే మోక్షానికి ద్వారం.

ద్వారకా నగరాన్ని ఎవరు నిర్మించారు?
ద్వారకా నగరాన్ని వైవస్వత మనువు వారసుడు అయిన రేవత రాజు నిర్మించారు. దీనిని రాక్షసులు ధ్వంసం చేసేశారు. ఇది కొంతకాలం మునిగిపోయి చిత్తడిగా ఉండేది. కృష్ణుడు ద్వారకాను పునరుద్ధరించాడు మరియు పునర్నిర్మించాడు.

ద్వారకాను నిర్మించడానికి కృష్ణుడు భూమిని ఎలా పొందాడు?
మథురలో ఉన్నప్పుడు, కృష్ణుడు సముద్ర దేవతను పిలిచి ఇలా అన్నాడు- నేను ఒక నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాను. నాకు వంద యోజనాల భూమి ఇవ్వండి. నేను దానిని మీకు తగిన సమయంలో తిరిగి ఇస్తాను.

కృష్ణుడు ద్వారకాకు ఎందుకు వెళ్లారు?
జరాసంధుడు కంసుడి మామగారు. కృష్ణుడు కంసుడిని చంపిన తర్వాత, జరాసంధుడు 17 సార్లు మథురపై దాడి చేశాడు. అతను మళ్లీ దాడి చేసినప్పుడు, కృష్ణుడు మరియు బలరాముడు ద్వారకాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది జరాసంధుడితో శాశ్వత విభేదాలను నివారించడానికని మాత్రమే.

కృష్ణుడి కోసం ద్వారకాను ఎవరు నిర్మించారు?
విశ్వకర్మా. యక్షులు, కూష్మాండులు, దానవులు, మరియు బ్రహ్మ రాక్షసులు అతనికి సహాయపడ్డారు. కుబేరుడు, శివుడు మరియు పార్వతి వారి వారి గణాలను పంపారు.. గరుడు విశ్వకర్మాతో తుది వరకు ఉన్నాడు. ద్వారకా రాత్రిపూట నిర్మించబడింది.

ద్వారక ఎలాంటి నగరం?
మూడు ప్రపంచాలలో, కొన్ని నగరాలు మాత్రమే ద్వారకా వలె గొప్పవి. ఇది వైకుంఠం వలె గొప్పదైనది, చాలా అందంగా మరియు భక్తులు ఎక్కువగా కోరుకునేవారు. దీని ప్రాంతం వంద యోజనాలు. ద్వారకా హిమాలయాల నుండి తెచ్చిన అమూల్యమైన రత్నాలతో నిర్మించబడింది. నిర్మాణంలో కలపను ఉపయోగించలేదు. కృష్ణుడి భార్యలలో ప్రతి ఒక్కరికీ ఇరవై గదులతో తన స్వంత రాజభవనం ఉండేది. ఉగ్రసేన రాజు మరియు కృష్ణుడి తండ్రి కోసం భారీ రాజభవనాలు నిర్మించబడ్డాయి. యాదవులందరికీ ఇళ్లు మరియు వారి సేవకులకు చిన్నఇళ్లు ఉండేవి. అన్నిచోట్లా మంగళకరమైన చెట్లు నాటబడ్డాయి. అన్ని విధాలుగా, ద్వారకా ఇంద్రుని అమరావతిని పోలి ఉండేది.

ద్వారకకు సంపదను ఎవరు అందించారు?
శంఖుడు, కుబేరుని నిధి కాపలాదారులలో ఒకడు. ద్వారకాను ధనసంపత్తులతో నింపమని కృష్ణుడు అతడిని కోరేడు. శంఖుడు యాదవుల ఇళ్లను సంపదతో నింపాడు.

ద్వారకా రాజ ఆస్థానం పేరు ఏమిటి?
సుధర్మ. దీనిని వాయుదేవుడు దేవలోకం నుండి ద్వారకాకు తీసుకువచ్చాడు.

ద్వారకా రాజు ఎవరు?
ఉగ్రసేనుడు.

ద్వారకా పురోహితుడు ఎవరు?
కాశీకి చెందిన ముని సందీపని.

బెట్ ద్వారక అంటే ఏమిటి?
బెట్ ద్వారక, ద్వారకా సమీపంలో గుజరాత్ తీరంలో ఒక చిన్న ద్వీపం. కృష్ణుడు ఇక్కడ నివసించేవారని ప్రజల నమ్మకం.

బెట్ ద్వారకకు మరో పేరు ఏమిటి?
శంఖోద్ధార్. శంఖాలు బెట్ ద్వారక యొక్క పెద్ద మూలం.

మథుర మరియు ద్వారక సంస్కృతి ఎందుకు సమానంగా ఉంటుంది?
మథుర నుండి వలస వచ్చిన యాదవులు ద్వారకను ఆక్రమించారు.

అర్జున మరియు సుభద్రల వివాహం ఎక్కడ జరిగింది?
ద్వారకాలో.

అర్జునుడు మరియు దుర్యోధనుడు ఇద్దరూ యుద్ధానికి సహాయం కోరుతూ కృష్ణుడిని సంప్రదించారు. ఆ సమయంలో కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు?
ద్వారకాలో.

ద్వారకా అర్జునుడిని ఎలా స్వాగతించింది
సోమనాథ వద్ద (ప్రభాస తీర్థం), కృష్ణుడు అర్జునుడిని కలుసుకుని ద్వారకాకు తీసుకువచ్చాడు. కృష్ణుని యొక్క సన్నిహితుడిని స్వాగతించడానికి ద్వారకాను అందంగా అలంకరించారు. అర్జునుడిని చూడటానికి ద్వారకా ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. వారు అతడిని గొప్ప గౌరవంతో స్వాగతించారు.

అర్జునుడు సుభద్రను ఎక్కడ కలుసుకున్నాడు?
రైవతక పర్వతం వద్ద పండుగ సందర్భంగా.

రైవతక పర్వతాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తారు?
గిర్నార్.

శిశుపాలుడి దాడి
ఒకసారి కృష్ణుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని సందర్శించినప్పుడు శిశుపాలుడు ద్వారకాపై దాడి చేశాడు. రైవతక పర్వతం మీద, అతను ఉగ్రసేనపై దాడి చేసి, అతని చాలామంది సేవకులను చంపాడు. మిగిలిన వారిని అతడు బందీలుగా ఉంచాడు. అప్పుడు కృష్ణుడి తండ్రి ద్వారా అశ్వమేధ యాగం జరపబడుతోంది. శిశుపాలుడు గుర్రాన్ని తీసుకెళ్లి పోయాడు. అతను బభ్రుడి భార్యను మరియు భద్ర (కృష్ణుడి మామయ్య కూతురు) ని కూడా అపహరించాడు.

కౌరవ సభలో, ద్రౌపది, వేధింపులకు గురైన సమయంలో, కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు?
ద్వారకాలో.

ద్వారకా రాజధానిగా ఉన్న కృష్ణుడి రాజ్యం పేరు ఏమిటి?
అనర్త.

ద్వారకాపై శాల్వుడి దాడి.
శాల్వ రాజు శిశుపాలుడి స్నేహితుడు. కృష్ణుడు శిశుపాలుడిని చంపిన తర్వాత, శాల్వుడు కృష్ణుడిని వెతుక్కుంటూ వచ్చాడు. ఆ సమయంలో కృష్ణుడు హస్తినాపురంలో ఉన్నాడు. యాదవ యువకులు అతనితో పోరాడారు. అతను వాళ్లలో చాలామందిని చంపేసాడు.

ద్వారకాకు ఎలాగ రక్షణ కల్పించబడింది?
అన్ని దిక్కుల కావలికోటలు ఉండేవి. నగరం అంతటా, సైనికుల సమూహాలు ఉండేవి. సైనికులు ద్వారక అంతటా కందకాలు మరియు సొరంగాలు నిర్మించారు. వారు అక్కడ నుండి పోరాడేవారు. భూమిలో, విషపూరిత ఇనపగోర్లు ఖననం చేయబడ్డాయి. శత్రువులను స్వేచ్ఛగా కదలకుండా నిరోధించడానికి, బిగింపులు వేయబడ్డాయి. క్షిపణి లాంటి ఆయుధాలను కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆహారం మరియు ఆయుధాలు రెండూ తగినంత సరఫరాలో ఉండేవి. గద, సాంబ, మరియు ఉద్ధవ వంటి యోధులు ద్వారకా దళాలకు నాయకత్వం వహించేవారు. ద్వారకాకు ముప్పును గుర్తించినప్పుడల్లా మద్యంపై నిషేధం విధించబడేది.

అశ్వత్థామ ద్వారక సందర్శన
అశ్వత్థామ ద్వారకాలో కృష్ణుడి వద్దకు వచ్చాడు. అతను తన బ్రహ్మశిర అస్త్రాలను కృష్ణుడి సుదర్శన చక్రంతో మార్పిడి చేసుకోవాలనుకున్నాడు. కృష్ణుడు చెప్పాడు- తీసుకో, నువ్వు నాకు తిరిగి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అశ్వత్థామ తన ఉత్తమ ప్రయత్నాలు చేసినప్పటికీ, కృష్ణుడి చేతిలో నుండి దానిని ఎత్తలేకపోయాడు. కృష్ణుడు అతనిని అడిగాడు- నీవు సుదర్శన చక్రాన్ని పొందగలిగితే, దానిని ఎలా ఉపయోగించుకునేవాడివి? అశ్వత్థామ ఇలా అన్నాడు: - నేను దానిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించెదను.

ద్వారకాలో తన బసను భగవాన్ ముందే చెప్పాడు
నారదుడు శ్వేత ద్వీపంలో శ్రీమన్నారాయణుడిని దర్శించాడు. భగవాన్ అతనితో అన్నారు- ద్వాపర యుగం ముగింపులో నేను మధురలో అవతారం ఎత్తుతాను. నేను కంసుడిని మరియు అనేక ఇతర అసురులను నాశనం చేస్తాను. అప్పుడు నేను కుశస్థలిని నా నివాసస్థలంగా చేస్తాను మరియు దానిని ద్వారకా అని పిలుస్తాను. నేను అక్కడ నరకాసురుడిని, మురడిని, మరియు పిఠుడిని చంపుతాను. నేను ప్రాగ్జ్యోతిషపురం రాజును చంపి అతని యావత్ సంపత్తుని ద్వారకాకు తీసుకుపోతాను. అప్పుడు భగవాన్ ఇలా అన్నాడు- నేను నా లక్ష్యాలను సాధిస్తాను. అప్పుడు, నా బంధువులైన ద్వారకా యొక్క గొప్ప యాదవులందరినీ నేను నాశనం చేస్తాను మరియు నా నివాసానికి తిరిగి వస్తాను.

పాండవుల అశ్వమేధ గుర్రాన్ని యాదవ యువకుల ద్వారా ఆపడం
పాండవుల అశ్వమేధ గుర్రం ద్వారకాకు సమీపించింది. యాదవ యువకులు దానిని నిలిపివేశారు. ఉగ్రసేన రాజు వారిని మందలించాడు. అతను అర్జునుడిని కలుసుకున్నాడు మరియు అతనికి గౌరవం ఇచ్చాడు. అర్జునుడు గుర్రం మార్గాన్ని అనుసరించి వెళ్లిపోయాడు.

ద్వారకా విధ్వంసం ఎప్పుడు జరిగింది?
కురుక్షేత్ర యుద్ధం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తరువాత.

ద్వారకా యొక్క యాదవులు ఏ వంశాలకు చెందినవారు?
భోజ, వృష్ణి, అంధక మరియు కుకుర.

ద్వారకా ఎలా నాశనం అయింది?
ద్వారకా రెండు శాపాల కారణంగా నాశనం అయింది 1. గాంధారి 2. ఋషులైన విశ్వామిత్రుడు, కణ్వుడు మరియు నారదుడు.

యాదవులను ఋషులు ఎందుకు శపించారు?
ఋషులు విశ్వామిత్రుడు కణ్వుడు మరియు నారదుడు ఒకసారి ద్వారకను సందర్శించారు. అప్పుడు యాదవులు వారిపై చిలిపి ఆట ఆడారు. కృష్ణుడి కుమారుడైన సాంబను ఆడ వేషధారణతో, వారు ఋషుల వద్దకు తీసుకువచ్చి ఇలా అన్నారు: ఈమె బభ్రుడి భార్య. ఆమె గర్భవతి మరియు ఒక కొడుకు కావాలని ఆశిస్తోంది. ఆమె కడుపు లోపల ఏమి ఉందో మీరు మాకు చెప్పగలరా? ఋషులు కోపగించి శపించేసారు. ఈ కృష్ణ కుమారుడి నుండి ఒక ఇనుప ఊస పుడుతుంది. ఇది కృష్ణుడు మరియు బలరాముడు మినహా అందరినీ చంపుతుంది. జర అనే వేటగాడి బాణంతో కృష్ణుడు చనిపోతాడు మరియు బలరాముడు తన శరీరాన్ని వదిలి సముద్రంలోకి ప్రవేశిస్తాడు.

గాంధారి కృష్ణుడిని శపించడం
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. గాంధారి కృష్ణుడితో ఇలా అన్నది నీ నిర్లక్ష్యం వల్ల కురు వంశం నాశనమైంది. నీవు దీన్ని ఉద్దేశపూర్వకంగా చేసావు. నీ నిర్లక్ష్యం కారణంగా, పాండవులు మరియు కౌరవులు పరస్పరం పోరాడారు. ఇప్పటి నుండి ముప్పై ఆరు సంవత్సరాల తరువాత, నీ స్వంత వంశాన్ని నాశనం చేయడానికి నువ్వు బాధ్యత వహిస్తావు. నీ బంధువులు మరియు శ్రేయోభిలాషులు ఒకరినొకరు చంపుకుంటారు. అనాథలాగ, నీవునూ అపవిత్రమైన మరణం కోసం మిగిలిపోతావు.

యాదవుల నిర్మూలనను నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
ఋషుల శాపం తరువాత రెండవ రోజు సాంబ నుండి ఇనుప ఊస బయటకు వచ్చింది. యాదవులు దానిని రాజు ఉగ్రసేన వద్దకు తీసుకెళ్లారు. అతను ఆ ఊసని చిక్కటి ధూళిగా పొడిచేసి సముద్రంలోకి విసిరేయాలని ఆదేశించాడు. యాదవులు అప్రమత్తంగా ఉండాలి. ద్వారకలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని రాజు ఆదేశించాడు. కృష్ణుడు వయోజన యాదవ పురుషులందరినీ సోమనాథుని వద్దకు తీసుకెళ్లాడు.

ద్వారక నాశనానికి ముందు, అక్కడ ఎలాంటి చెడు శకునాలు కనిపించాయి?
యాదవులు యమరాజ తమ ఇళ్లలోకి చొరబడడాన్ని చూడగలిగారు. చుట్టూ ఎలుకలు ఉండేవి. ప్రజలు పడుకున్నప్పుడు, ఎలుకలు వారి గోర్లు మరియు వెంట్రుకలను కొరుకేసాయి. ప్రతిచోటా పావురాలు ఎగురుతుండేవి. మైనాలు పగలు మరియు రాత్రి అరుస్తూ ఉండేవి. మేకలు నక్కల్లా అరుస్తూ ఉండేవి. ఆవులు గాడిదలను జన్మనిచ్చాయి. కుక్కలు పిల్లులను జన్మనిచ్చాయి. పెద్దలను, దేవుళ్లను, పూర్వీకులను బహిరంగంగా అవమానించేవారు. భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకునేవారు. అగ్ని జ్వాలలు ఎల్లప్పుడూ ఎడమ వైపుకు తిరుగుతూ ఉండేవి. తాజా ఆహారంలో పురుగులు అకస్మాత్తుగా కనిపించేవి. గ్రహాలు మరియు నక్షత్రాలు ఆకాశంలో ఢీకొన్నట్లు కనిపించేవి. ఇరవై ఏడు రాశులు అదృశ్యమయ్యాయి. కృష్ణుడు పాంచజన్యంను ఊదినప్పుడు గాడిదలు ప్రతిచోటా ఏడ్చాయి.

ద్వారకా యొక్క యాదవులు ఒకరినొకరు ఎక్కడ చంపుకున్నారు?
సోమనాథ్ వద్ద (ప్రభాస క్షేత్రం)

యాదవులు ఎలా చంపబడ్డారు?
వారు సోమనాథ్ వద్ద పూర్తిగా మత్తులో ఉన్నారు. కృతవర్మా, మరియు సాత్యకి, కురుక్షేత్ర యుద్ధంలో వారి చర్యలపై పోరాడారు. సాత్యకి కృతవర్మాను చంపాడు. భోజులు మరియు అంధకులు సాత్యకి మరియు ప్రద్యుమ్నలను చంపారు. ఆ ప్రదేశంలో ఏరక అనే గడ్డి ఉండేది. సముద్రంలోకి విసిరిన ఇనుప ఊస పొడినుండి అవి పెరిగాయి. కృష్ణుడు చేతినిండా ఎరక గడ్డిని పట్టుకున్నాడు మరియు అది ఇనుప ఊహల సమూహంగా మారిపోయింది. ఆ ఇనుప ఊసలతో, కృష్ణుడు తన మార్గాన్ని దాటిన వారందరినీ చంపాడు. దీనిని చూసిన ఇతర యాదవులు ఇనుప ఊసలుగా మారిన గడ్డిని కూడా ఎత్తుకున్నారు. వాటిని ఉపయోగించి, వారు ఒకరినొకరు చంపుకున్నారు. మిగిలిన వారందరూ కృష్ణునిచే చంపబడ్డారు.

యాదవులు ఒకరినొకరు చంపుకున్న తర్వాత ఎవరు ద్వారకలో మిగిలిపోయారు?
మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు.

బలరాముడు ఎలా చనిపోయాడు?
యాదవులందరూ ఒకరినొకరు చంపుకున్న తర్వాత బలరాముడు సమాధిలోకి ప్రవేశించాడు. అతని నోటి నుండి ఒక పెద్ద పాము (ఆదిశేషము) వచ్చి సముద్రంలోకి ప్రవేశించింది.

కృష్ణుడిని ఎవరు చంపారు?
ద్వారకా యొక్క యాదవులందరూ ఒకరినొకరు చంపుకున్నారు, కృష్ణుడు సమాధిలోకి ప్రవేశించి జాలువారాడు. ఒక వేటగాడు పొరపాటున ఒక జింకగా భావించి భగవంతుడి పాదాల మీద బాణం వేశాడు. అతడు భగవంతుడిని చూసినప్పుడు భయపడ్డాడు. కృష్ణుడు అతడిని ఓదార్చి అతని శరీరాన్ని విడిచిపెట్టాడు.

కృష్ణుడు ఎక్కడ చంపబడ్డాడు మరియు దహనం చేయబడ్డాడు?
సోమనాథ్ దేవాలయం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న భాలకా తీర్థం వద్ద.

యాదవుల సంహారానికి వాసుదేవుడు ఎవరిని నిందించాడు?
సాత్యకి మరియు ప్రద్యుమ్నుడిని. కానీ ఋషులు మరియు గాంధారి శాపం కారణంగా ఇది జరిగిందని కూడా అతను చెప్పాడు. కృష్ణుడు వారిని రక్షించడానికి ప్రయత్నించలేదు. ఋషుల మరియు గాంధారి యొక్క సాపాలు అసమర్థంగా మారాలని అతను కోరుకోలేదు.

కృష్ణుడు మరియు బలరాముడి అంత్యక్రియలను ఎవరు నిర్వహించారు?
అర్జునుడు కృష్ణుడు మరియు బలరాముని అంతిమ సంస్కారాలు చేశాడు. అతను వాసుదేవుడు మరియు ఒకరినొకరు చంపుకున్న యాదవుల అంత్యక్రియలను కూడా చేశాడు.

ద్వారకా ఎలా మునిగిపోయింది?
ద్వారకాలో ఉండిపోయిన వారందరినీ అర్జునుడు ఇంద్రప్రస్థనికి తీసుకెళ్దామని వారిని నెమ్మదిగా బయటకు కొనసాగిస్తుండగా, ద్వారకా సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది.

ద్వారకా యొక్క మహిళలకు ఏమైంది?
అర్జునుడు ద్వారకాలో జీవించి ఉన్న మహిళలు, పిల్లలు మరియు వృద్ధులను ఇంద్రప్రస్థనికి తీసుకెళ్తునప్పుడు. దారిలో వారు పంచనద వద్ద విడిది చేశారు. అక్కడ ఆభీర దొంగలు వారిపై దాడి చేసి వారి నుండి పెద్ద సంఖ్యలో మహిళలు మరియు విలువైన వస్తువులను తీసుకుపోయారు. ఎవరైతే మిగిలి పోయారో వారిని మార్తికత్వ వంటి ప్రదేశాలలో ఉంచారు. కొంతమంది మహిళలు అర్జునుడితో కలిసి ఇంద్రప్రస్థనికి తిరిగి వచ్చారు. రుక్మిణి, లక్ష్మణ, జాంబవతి, మిత్రవింద, కాళింది సతి నిర్వహించారు. సత్యభామ, నగ్నజితి మరియు భద్ర తపస్సు చేయడానికి వెళ్లిపోయారు. అక్రూరిడి భార్యలు కూడా తపస్సు చేయడానికి వెళ్లిపోయారు.

ద్వారకా శారదా పీఠం అంటే ఏమిటి?
ఆది శంకరాచార్యులు నాలుగు మఠాలను స్థాపించారు. ఇది సనాతన ధర్మం మరియు అద్వైత వేదాంతం యొక్క ప్రచారం కోసం. వాటిలో ద్వారకా శారదా పీఠం ఒకటి.

ద్వారకా శారదా మఠం యొక్క ప్రస్తుత అధిపతి ఎవరు?
స్వామీ స్వరూపానంద సరస్వతిగారు.

ద్వారకా శారదా మఠం యొక్క మొదటి అధిపతి ఎవరు?
హస్తామలకాచార్యులవారు

ద్వారకాధీశ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు?
శ్రీ కృష్ణుడి మనవడు, వజ్రనాభుడు

ద్వారకా నీటిలో మునిగిపోయిందా?
అవును. యాదవులు తమలో తాము పోరాడి ఒకరినొకరు చంపుకున్నారు. కృష్ణుడు తన దివ్య నివాసానికి బయలుదేరాడు. అర్జునుడు ద్వారకా నుండి మిగిలిన నివాసులను బయటకు తీశాడు. అప్పుడు సముద్రం ద్వారకాను తనలో కలుపుకంది.

ద్వారకా ఏ మహాసముద్రంలో మునిగిపోయింది?
అరేబియా మహాసముద్రంలో

Copyright © 2022 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Active Visitors:
3352790