వినాయకుడి విరిగిన దంతాల వెనుక కథ భిన్నంగా ఉంటుంది. వ్యాసుడు నిర్దేశించిన ఇతిహాసాన్ని రాయడానికి గణేశుడు తన దంతాన్ని పెన్నుగా ఉపయోగించాడని మహాభారతంలోని ఒక సంస్కరణ పేర్కొంది. విష్ణువు యొక్క మరొక అవతారమైన పరశురాముడితో జరిగిన పోరాటంలో గణేశుడు తన దంతాన్ని విరిచాడని మరొక సంస్కరణ పేర్కొంది.
ప్రేమ, కృతజ్ఞత మరియు భక్తితో నిండిన హృదయాన్ని పెంపొందించడం ద్వారా ప్రతిదానిలో దైవాన్ని చూడాలని భక్తి యోగ మనకు బోధిస్తుం
అనుగ్రహం కోసం నవగ్రహ మంత్రాలు
ఓం సూర్యాయ నమం ఓం సోమాయ నమః ఓం అంగారకాయ నమః ఓం బుధాయ నమః ....
Click here to know more..కళలలో విజయం కోసం చంద్ర గాయత్రీ మంత్రం
శివ వర్ణమాలా స్తోత్రం
అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణితగుణగణ అమృతశివ . సాంబసదాశి....
Click here to know more..కాశీమాహాత్మ్యము
శ్రీమంతంబును, జతురానన సన్నిభమహర్షి ధామం బును, నమందజ్ఞానలక్ష్మీ ప్రదంబును, నిఖిల స్తుత్యవిచిత్ర వైభవ శోభితంబును, గంధర్వాప్సర స్సేవితంబును, జాతివై రంబు వీడి సఖ్యంబున నొప్పు మృగకులములచేఁ బరివృతంబును సంయ మివరులొసంగు ఘాసగ్రాసంబులఁ గుడుచు సారంగకిశోరభాసు కంబును నిరంతరయాగ ధూమవ్యావృతన భోమండలమండితం బును, మునిక న్య కాకృతవివాహవై భవశోభాయమానతరు లతాబృందవిరాజితంబును, వేదశాస్త్రపురాణేతిహాసోపన్యాస ప్రవీణకీరళారి కాకోకల వాదనాద మేదుకంబును నానందదాయ కంబును నగు నైమిశారణ్య మను నరణ్యం బొండు పుణ్యప్రదం జై భరతఖండంబున నొప్పుచుండు. అందు యోగవిద్యావిశా రదులు, బ్రహ్మజ్ఞానతత్పరులు, ముక్తికాములు, లోక పూజి తులు, త్య క్తపాపులు, అపగ తక్రోధులు, జితేంద్రియులు, భూత దయాపరతంత్రులు, విపులతపోధనసంపన్నులు నగు శౌనకాది మహర్షులు శిష్యగణసేవితులై యొక్కనాఁడు గుమిగూడి మోక్షంబునకు సులభోపాయం బగు మార్గంబు నెఱుంగఁ
దలంచి యన్యోన్యసంభాషణంబులు నొప్పుతఱి, యచ్చటికి వ్యాసశిష్యుండు, మౌనివర్యుండు, నిఖిలపురాణకథన చాతురీ విఖ్యాతయశుండు సూతుండు చను దెం చెను. ఇట్లుచను దెంచిన నమ్మని నమ్మునిరాజులు, భక్తివినయంబుల నర్ఘ్యపాద్యంబులఁ బూజలొనర్చి యున్న తాసన మిడి ప్రసన్ను నిఁ జేసి, జగద్ధితార్థం బుగ, సూతా! మున్ను సత్యవతీతనూభవునివలన సకలపురా ణంబులు వినియుంటివి. నీ వెఱుంగని రహస్యంబులు గాన రావు. మాయందుఁ గరుణ యునిచి సూక్ష్మములో మోక్షము లభించు మార్గమును సాదరంబున నెఱిఁగింపు మని వేఁడుకొనఁ జొచ్చిరి శౌనకాదిఋషుల మన్ననలకు ప్రార్థనలకు సూతుఁడు ముదమంది వారల విలోకించి, గురువరునకు నమస్కరించి, తపోధనులారా! లోకహితంబు గమనించి మంచి ప్రశ్నం. బొనరించితిరి. ఈర హస్యంబు తొల్లి భృగుమహర్షి లోమళాది మునివర్యులకు వినిపించిన తెఱంగున, ముక్తిసాధన మగుకాశీ క్షేత్ర మాహాత్మ్యమును వివరించెద. చిత్తనిగ్రహుల రై శ్రద్ధాభ క్తుల నాలింపుఁడు అని యిట్లు సూతుఁడు చెప్ప నుషక్రమించె.
ఒకానొక సమయమునందు నర్మదానదీతీరమున, భవ భక్తాగ్రేసరుం డగు భృగుమహర్షి శాన్తచిత్తంబున నొప్పుతఱి, లోమశాదిమహర్షులు డగ్గరి, భ క్తివినయంబుల నమస్కరించి మహాత్మా, ఋషి స త్తమా! సర్వతత్వవిశారదా! కరుణావరు ణాలయా! ధర్మవిదులు వేదాంత రహస్యంబులనుఁ బరిశీలించి, మాయామోహితు లగు శిష్యులకుఁ దత్సారంబు నుపదేశించి ము_క్తితెఱఁగు పొసఁగింతురు. అట్టి రహస్యంబులను గుఱు మీూరలు, సందిగ్ధహృదయులమై యజ్ఞానతిమిరం దగిలి తెన్ను గానక తలంబడు మముబోంట్లకు ము_క్తిమార్గమును జూపరే యని పలువిధంబులఁ బ్రార్థింప, నమునిచంద్రుఁడు వారలం గాంచి, సకరణంబుగ, ముని వరులారా! మీర లడిగిన యర్థంబు సర్వజనమాన్యంబు. పరోపకారపూరితంబు. సమస్త పాపక్షయకరంబు. తపోమహి మంబున ధన్యతఁగాంచిన మిముబోంట్లకుఁ దత్త్వ మెఱిం గింప, వేదాంతసారసంగ్రహుం డగు పితామహుం డైన సమర్థుండు కాఁజాలఁ డన నేనెంత? అయినను, మును గురు వర్యులకరుణావి శేషంబువలన వినినదియు నేఁ గనినదియు సవిస్తరముగ వినిపించెద. ఇందులకు హృదయపంకంబుల విదళింపం జాలు నొక యితిహాసము గలదు. అయ్యది సావ ధానులరై వినుఁడు. అని పలుకుచు, భ క్తచింతామణి. యగు శంకరునకు శరణాగతుఁ డై యిట్లు చెప్పఁదొడంగె.
కల్పాంతమందు, సూర్యచంద్రాది గ్రహనష్టమై, పృథివ్య ప్లేజో వాయా కాశశూన్యమై యొప్పు మహాప్రళయమున, సత్త్వరజస్తమోగుణంబులు సమత్వము నొందఁ, బర మేశ్వరుఁ డయ్యవిరళమాయామోహంబునఁ జిక్కువడి, చిరకాలము యోగనిద్రాపరతంత్రుఁ డయ్యె. అంత మేల్కాంచి తగు యత్నమున సృష్టి యొనర్ప బుద్ధి బుద్ధి వొడమఁ బ్రకృతియును,. బ్రకృతివలన నాకాశమును, దాన వాయువు, నందువలన వహ్నియు, వహ్నివలన జలము, జలమున భూమియు జనన మయి క్రమంబున వృద్ధి చెందెను.
Ganapathy
Shiva
Hanuman
Devi
Vishnu Sahasranama
Mahabharatam
Practical Wisdom
Yoga Vasishta
Vedas
Rituals
Rare Topics
Devi Mahatmyam
Glory of Venkatesha
Shani Mahatmya
Story of Sri Yantra
Rudram Explained
Atharva Sheersha
Sri Suktam
Kathopanishad
Ramayana
Mystique
Mantra Shastra
Bharat Matha
Bhagavatam
Astrology
Temples
Spiritual books
Purana Stories
Festivals
Sages and Saints
Bhagavad Gita
Radhe Radhe