చిన్న కృష్ణుడు అఘాసురుడిని ఎలా చంపాడు?

Listen to this article


చిన్ని కృష్ణుడు అఘాసురుడు అనే భారీ రాక్షసుడిని ఎలా చంపాడనేది కథ.

అఘాసురుడు ఎవరు?

అఘాసురుడు కంసుడి సేనాధిపతి. సంస్కృతంలో అఘా అంటే పాపం అని అర్థం.

కంసుడు ఎవరు?

కంసుడు శ్రీకృష్ణుని తల్లి తాలుక సోదరుడు (మేనమామ). అతను చాలా క్రూరమైనవాడు మరియు దుర్మార్గుడు. అతను తన తండ్రిని చెరసాలలో పెట్టి మధురకు రాజు అయ్యాడు.

శ్రీకృష్ణుని తల్లిదండ్రులను కంసుడు ఎందుకు బంధించాడు?

కృష్ణుడి తల్లిదండ్రుల పెళ్లి సమయంలో, వారి ఎనిమిదవ కొడుకు కంసుడిని చంపేస్తాడని ఓ ఆకాశవాణి వినిపించింది. కంసుడు వారిని బంధించి ఒక్కొక్క బిడ్డ పుట్టిన వెంటనే చంపేశాడు.

కృష్ణుడు ఎలా తప్పించుకున్నాడు?

కృష్ణుడు సర్వశక్తిమంతుడు. అతను పుట్టినప్పుడు, తన తండ్రి వాసుదేవుడిని చెరసాల నుండి బయటకు తీసుకురావాలని ప్రేరేపించాడు.

అతను స్వామిని గోకులానికి తీసుకెళ్లి వసుదేవుని బంధువైన నందుని ఇంట్లో విడిచిపెట్టారు. అదే సమయంలో నంద-యశోద దంపతులకు కూడా ఆడపిల్ల పుట్టింది. ఆమెను చెరసాలకు తీసుకొచ్చారు.

ఆ అమ్మాయి ఏమైంది?

ఆడపిల్ల అయినప్పటికీ, కంసుడు ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె అమ్మవారి అవతారం. ఆమె కంసుని చేతిలోంచి జారిపోయి అదృశ్యమైంది. ఆమెను వింధ్యవాసినీ దేవీగా పూజిస్తారు.

కృష్ణుడు జీవించి ఉన్నాడని తెలుసుకున్న కంసుడు ఏం చేసాడు?

కృష్ణుడిని చంపడానికి కంసుడు చాలా మంది రాక్షసులను గోకులానికి పంపడం ప్రారంభించాడు. వారిలో అఘాసురుడు ఒకడు.

గోకులంలో అఘాసురుడు ఏం చేసాడు?

అఘాసురుడికి మంత్ర శక్తులుండేవి. అతను ఆకాశంలో ఎగురుతూ వచ్చి, కృష్ణ మరియు అతని స్నేహితులు కాళింది నది ఒడ్డున ఆడుకోవడం చూశాడు. పెద్ద పాములా మారి నోరు తెరిచి నేలపై పడుకున్నాడు. అబ్బాయిలు గుహ అనుకుని మామూలుగా లోపలికి వెళ్లారు. కృష్ణుడు మరియు అబ్బాయిలందరూ లోపల ఉండగా, అఘాసురుడు తన నోరు మూసుకుని, వారిని చితకబాదడం ప్రారంభించాడు. కొంతమంది అబ్బాయిలు చనిపోయారు.

చిన్న కృష్ణుడు అఘాసురుడిని ఎలా చంపాడు?

శ్రీకృష్ణుడు స్వయంగా ఎదగడం ప్రారంభించాడు. అతను అఘాసురుని శరీరం పగిలిపోయేంత పెద్దవాడయ్యాడు. అఘాసురుడు మరణించాడు. కృష్ణుడు తన దివ్యశక్తి ద్వారా చనిపోయిన ఆ అబ్బాయిలను బ్రతికించాడు. మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు. అలా కంసుని దుష్ట ప్రణాళిక చెడిపోయింది.

Author

అనువాదం : వేదుల జానకి

Audios

1

1

Copyright © 2021 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Active Visitors:
2445771